ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొరుకంటి చందుర్... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని.. అందరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన ఎమ్మెల్యే - రామగుండం మున్సిపల్ కార్పోరేషన్
రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలన్నా లక్ష్యంతో ఏటా హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మొక్క నాటారు.
పెద్దపల్లి జిల్లా వార్తలు
హరితహరం కార్యక్రమం ద్వారా రామగుండం మున్సిపాలిటీ పరిధిలో లక్షల మొక్కలు నాటామని వెల్లడించారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:WEATHER REPORT: హైదరాబాద్లో రాత్రి నుంచి భారీవర్షం