కార్మిలకు హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ 41 బొగ్గు బ్లాక్‌లను కేంద్రం ప్రైవేటీకరణ చేయడంపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు బి.వెంకట్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలను భాజపా నేతలు ప్రశ్నించాలి: ఎమ్మెల్యే - latest news of peddapalli
కేంద్రం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రం వైఖరిని భాజపా నేతలు ప్రశ్నించాలని ఆయన కోరారు.
కార్మిక వ్యతిరేక విధానాలను భాజపా నేతలు ప్రశ్నించాలి: ఎమ్మెల్యే
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికలోకమంతా ఒక్క తాటిపై ఉండి పోరాడాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని భాజపా నేతలు ప్రశ్నించాలన్నారు. ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, టీబీజీకేఎస్ అధ్యక్షులు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కేంద్ర నాయకులు జహీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు