తెరాస ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదో డివిజన్లో రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే చందర్ ప్రారంభించారు.
కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే - latest news of peddapalli
పల్లెలు, పట్టణాల అభివృద్ధే ప్రధాన ఎజెండాగా.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు.
అభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన ఎజెండా: ఎమ్మెల్యే చందర్
రామగుండం కార్పొరేషన్‌కు సంబంధించిన కొందరు కాంగ్రెస్ నేతలు అభివృద్ధి జరుగలేదని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు కాంగ్రెస్ నాయకులు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వ పాలన సాగుతుందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి:అద్దె అడిగాడని ఇంటి యజమానినే చంపేశాడు!