పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి 11వ బొగ్గుగనిలో అదృశ్యమైన కార్మికుడు మృత దేహం లభ్యమైంది. ఈనెల 7న విధులకు వెళ్లిన సంజీవ్... తిరిగి బయటకు రాలేదు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం సాయంత్రం మరోసారి గాలింపు చేపట్టగా... రెస్క్యూ సిబ్బంది విగతజీవిగా పడి ఉన్న సంజీవ్‌ను గుర్తించి బయటకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
అదృశ్యమైన కార్మికుడు.. విగతజీవిగా
రామగుండం సింగరేణి 11వ బొగ్గుగనిలో అదృశ్యమైన కార్మికుడిని విగతజీవిగా గుర్తించారు. 11 రోజుల తర్వాత గనిలోని బంకర్ వద్ద కార్మికుడు సంజీవ్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది.
గనిలోకి ఒక్క కార్మికుడినే విధులకు పంపడం సరైంది కాదని కార్మిక సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంజీవ్ మృతికి సింగరేణి యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుని కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే సంజీవ్ మృతి చెందాడని ఆరోపించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో.. రామగుండం ఎమ్మెల్యే చందర్, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు సంజీవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇదీ చూడండి :జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 30 కరోనా కేసులు