తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లంపల్లి వద్ద గోదారమ్మకు మంత్రుల పూజలు... - Ministers worship Godavari river at Ellampalli ...

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి చేరుకున్న గోదారమ్మకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తపస్సు వల్లే నిరుపయోగంగా సముద్రంలో కలుసున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని మంత్రులు కొనియాడారు.

Ministers worship Godavari river at Ellampalli ...

By

Published : Aug 10, 2019, 7:53 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్న గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య గోదారమ్మకు పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు త్రాగు, సాగు నీరు అందిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. కేసీఆర్ లక్ష్యం కోటి ఎకరాలకు సాగు నీరూ అందించటమేనన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన ఎమెల్యేలు బాల్కసుమన్,దుర్గం చిన్నయ్య, జడ్పీ ఛైర్మన్​లు నల్లాల భాగ్యలక్ష్మి, కోవా లక్ష్మి పాల్గొన్నారు.

ఎల్లంపల్లి వద్ద గోదారమ్మకు మంత్రుల పూజలు...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details