పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ్ సందర్శించారు. ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో సమీక్షించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణ పనులు కొంత ఆలస్యమవుతున్నాయన్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. డిసెంబర్ 15 నాటికి పూర్తిస్థాయి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. తర్వాత ఆరునెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై ఇప్పటికే చర్చించామన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
'డిసెంబర్ 15 నాటికి రామగుండం ఎరువుల కర్మాగారం' - minister sadananda goud visited ramagundam fertilizer plant
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ్ సందర్శించారు. డిసెంబర్ 15 నాటికి పూర్తిస్థాయి నిర్మాణం పూర్తవుతుందని.. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయమై ఇప్పటికే చర్చించామని తెలిపారు.
'డిసెంబర్ 15 నాటికి రామగుండం ఎరువుల కర్మాగారం'
మంత్రికి నిరసన సెగ
మంత్రి పర్యటన సందర్భంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీ వెంకటేష్‌తో మంత్రి చర్చించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కృషి: కేటీఆర్
TAGGED:
ramagundam fertilizer plant