Minister KTR Peddapalli District Tour Today : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని రెండు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయునున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముందుగా మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో రూ.313 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. తరవాత పెద్దపల్లి జిల్లాలో సింగరేణి స్థలంలోని నిర్వాసితులకి పట్టాలు ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
KTR Mancherial Tour Details : మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, క్యాతనపల్లి పురపాలికల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ జిల్లాలో రూ.313 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ పురపాలికలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, మహిళా భవన్ , మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరంలో మందమర్రి నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. ఈ పర్యవేక్షణ పనులు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలన చేసి.. ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు.
KTR Speech at Singareni : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతా గులాబీ మయమైంది. సింగరేణి స్టేడియంలో దశాబ్ది ప్రగతి సభ(Dasabdi Pragati Sabha) ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సింగరేణి స్టేడియంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు.