పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కింద నిర్వాసితుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించి వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భూముల విలువ ఇప్పటికి 20 సార్లకు పైగా రివ్యాలువేషన్ చేశామని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల పరిహారం అందించినట్లు, అర్హులు ఇంకా మిగిలి ఉంటే తప్పనిసరిగా అందజేస్తామన్నారు.
ఎల్లంపల్లి భూనిర్వాసితుల సమస్యలపై మంత్రి సమీక్ష - minister koppula review on ellampalli project
పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ సమస్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షించారు.
ఎల్లంపల్లి భూనిర్వాసితుల సమస్యలపై మంత్రి సమీక్ష