రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపెల్లి జిల్లాలో పర్యటించిన ఆయన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మంత్రి కొప్పుల సమీక్ష - పంట కొనుగోలు కేంద్రాలపై మంత్రి సమీక్ష
రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లాలో పర్యటించిన ఆయన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
పెద్దపెల్లి జిల్లాలో పంట కొనుగోలు కేంద్రాలపై మంత్రి సమీక్ష
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషిలో పతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసే క్రమంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.