గొల్ల, కుర్మల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కుల వృత్తులకు ప్రభుత్వం పోత్సాహం ఇస్తోందని పేర్కొన్నారు. ఉచితంగా గొర్రెలు అందించి వారికి భరోసా కల్పిస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా ఆంతార్గాం మండలం కుందనపల్లి వద్ద గొర్రెల మార్కెట్ యార్డ్‌ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
సులభ విక్రయాలు
రాష్ట్రంలోనే మెదటి సారిగా రామగుండం నియోజకవర్గంలో గొర్రెల మార్కెట్ యార్డు ప్రారంభించారని మంత్రి తెలిపారు. సులభంగా విక్రయించడం ద్వారా కొనుగోలు దారులకు లాభం కలుగుతుందన్నారు. 25 లక్షలతో మార్కెట్ నిర్మించినట్లు తెలిపారు.