నాయకులు మంచిగా ఉంటే ఊరు బాగుంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పరిశుభ్రంగా ఉన్న పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు కేటాయించడం ఒక్క తెలంగాణలో జరుగుతోందని కొప్పుల పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు మున్సిపాలిటీ ఛైర్పర్సన్ పుట్ట శైలజ, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట ముధు కృషిచేస్తున్నారని కొనియాడారు. రూ.123 కోట్ల డీఎంఎఫ్టీ నిధులను మంథని నియోజకవర్గానికి తెచ్చిన ఘనత పుట్ట మధుకే దక్కుతుందని మంత్రి అన్నారు.