పెద్దపల్లి జిల్లా మంథని పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంబురాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. మంథనిలో తెరాస పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
'గెలిచేది మనమే... సంబురాలకు సిద్ధమవ్వండి' - మంథనిలో మంత్రి కొప్పుల పర్యటన
మంథని పట్టణాన్ని కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత తెరాస పార్టీదేనని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల పర్యటన
ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ఐదేళ్లుగా తెరాస చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని మంత్రి కొప్పుల కోరారు. మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డులకు 13 వార్డులు గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
- ఇవీ చూడండి: సమత నిందితుల తరఫున సాక్ష్యులు లేరు..!