పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి అర్జీ-1 ఏరియాలో వనమహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ భారతి హోళీకేరి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు, కార్మికులు మొక్కలు నాటారు.
సింగరేణిలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల - minister koppula at vana mahotsavam
సింగరేణి సంస్థ వారు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి అర్జీ-1 ఏరియాలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మొక్కలు నాటారు. ప్రజలందరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని.. కేవలం మొక్కను నాటడమే కాక వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కొప్పుల విజ్ఞప్తి చేశారు.
![సింగరేణిలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల minister koppula eshwar planted saplings at vana mahotsavam in singareni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8144779-437-8144779-1595511438934.jpg)
వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి కొప్పుల అన్నారు. ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి.. వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కొప్పుల అన్నారు. సింగరేణి సంస్థకు సీఎస్ఆర్ నిధులు పుష్కలంగా ఉన్నాయని... ప్రణాళికాబద్ధంగా ఆ నిధులను హరితహారం కార్యక్రమానికి వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరికు మంత్రి సూచించారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం