తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలతో ప్రజా సమస్యలకు పెద్దపీట' - telangana news

గత ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు.

minister-koppula-eshwar-laid-foundation-stone-for-mla-camp-office-in-peddapalli-district, మంత్రి కొప్పుల ఈశ్వర్
'ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలతో ప్రజా సమస్యలకు పెద్దపీట'

By

Published : Jan 8, 2021, 2:52 PM IST

పేద ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న శాసన సభ్యుల క్యాంపు కార్యాలయాలు దోహదపడతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన భూమి పూజ చేశారు.

గత ప్రభుత్వాలు ఏనాడూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. ప్రజల సమస్యలు ఎలాంటివైనా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి చెప్పే వీలు ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:దర్శనానికి వెళ్తుండగా మినీ బస్సు బోల్తా - ముగ్గురు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details