తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్టీపీసీ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి: మంత్రి కొప్పుల - మంత్రి కొప్పుల ఈశ్వర్​ సమీక్షా సమావేశం

పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించినప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​, ఎంపీ వెంకటేష్​ నేత పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో ఎన్టీపీసీ, ఆర్​ఎఫ్​సీఎల్ అధికారులతో అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్టీపీసీ అధికారులు బాధ్యతగా వ్యవహరించి ప్రజల కనీస సౌ కర్యాలను తీర్చాల్సిన అవసరం ఉందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

minister koppula eeshwar review meeting in peddapally
ఎన్టీపీసీ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి: మంత్రి కొప్పుల

By

Published : Nov 4, 2020, 7:12 AM IST

పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించినప్పుడే అసలైన అభివృద్ధి ఆకాంక్షించవచ్చునని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత పేర్కొన్నారు. హరితహారంలో లక్ష మొక్కలు కాకుండా 10 లక్షలకు పైగా మొక్కలు నాటి ఎన్టీపీసీ యాజమాన్యం వాటి సంరక్షణ చూసుకోవాలని మంత్రి సూచించారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో ఎన్టీపీసీ, ఆర్​ఎఫ్​సీఎల్ అధికారులతో అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ఆర్ కింద రూ. 7 కోట్లు కాకుండా ఎక్కువ నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో అభివృద్ధి బాటలు వేయాలని సూచించారు.

ప్రజల అవసరాలను ప్రజాప్రతినిధులు వినతి పత్రాల ద్వారా తెలుపుతారని, వాటిపై కనీస స్పందన లేకపోవడం ఎన్టీపీసీ అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనమని కొప్పుల ఎద్దేవా చేశారు. ఉత్పత్తిపై చూపిస్తున్న శ్రద్ధ పరిసర గ్రామాలపై కూడా ఉండాలని అన్నారు. వారి కనీస సౌకర్యాలు తీర్చాల్సిన బాధ్యత సంస్థలపై ఉందని పేర్కొన్నారు. ఎన్టీపీసీ ప్రాంతంలో ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేయాలని, ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి

తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎస్ఆర్ కింద అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. దీని ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్య తీర్చాలని పేర్కొన్నారు. కాలనీలకు దూరంగా ఉన్న మరో వైపు నుంచి బూడిద పైప్​లైన్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్ఎఫ్​సీఎల్ ఎరువుల కర్మాగారం నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చిన వీర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాల నిరుద్యోగులకు 100% ఉద్యోగాలు కల్పించాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్​సీఎల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే'

ABOUT THE AUTHOR

...view details