తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ మల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం హరితహారంపై రూపొందించిన బహుమతి పాటల సీడీని ఆవిష్కరించారు.
మొక్కల పెంపకం ప్రతిఒక్కరి బాధ్యత: మంత్రి కొప్పుల - మంత్రి కొప్పుల ఈశ్వర్
హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెుక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆరో విడత హరితహారంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ మల్కాపూర్‌లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలువురు నేతలతో కలిసి మొక్కలు నాటారు.

ప్రతి ఒక్కరు బాధ్యతగా మెుక్కలు నాటి సంరక్షించాలి: మంత్రి కొప్పుల
రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటాల్సి ఉండగా.. ఇప్పటివరకు 182 కోట్ల మొక్కలు నాటినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆరో విడత హరితహారంలో నాటే మొక్కలతో ఎంచుకున్న లక్ష్యం పూర్తవుతుందని మంత్రి అన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యవరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ సూచించిన విధంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.
ఇవీ చూడండి: '30 కోట్ల మొక్కలు నాటడమే ఆరో విడత హరితహారం లక్ష్యం'