పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో పని చేస్తున్న వలస కార్మికులు తమ తమ స్వరాష్ట్రాలకు పంపించాలంటూ ఆందోళనకు దిగారు. సుమారు 4 వేల మంది రాజీవ్ రహదారిపై బైఠాయించారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను అడ్డగించారు.
తమను స్వస్థలాలకు పంపించాలంటూ 2 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన ఉద్ధృతం చేయడం వల్ల పోలీసులు లాఠీఛార్జి చేసి కార్మికులను చెదరగొట్టారు.