పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది కార్మికులు నిరసనకు దిగారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కార్మికులను చెదరగొట్టారు. ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు.
ఎన్టీపీసీ వద్ద వలస కార్మికుల ఆందోళన - updated news on Migrant workers agitation on NTPC Rajiv road
రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలని కోరుతూ నిరసనకు దిగారు.
![ఎన్టీపీసీ వద్ద వలస కార్మికుల ఆందోళన Migrant workers agitation on NTPC Rajiv road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7039358-191-7039358-1588482651832.jpg)
ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికుల ఆందోళన