తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిగువ, పేద తరగతి ప్రజలే మట్కా టార్గెట్' - RAMAGUNDAM POLICE COMMISIONERATE

రాష్ట్రానికి మట్కా అనే మహమ్మారి సోకింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ముంబయి ప్రధాన కేంద్రంగా ఈ వ్యాపారం జోరుగా  సాగుతోందని రామగుండం సీపీ తెలిపారు.

తొమ్మిది మంది పోలీసులపై సీపీ సత్యనారాయణ కఠిన చర్యలు

By

Published : Jun 1, 2019, 11:29 PM IST

మధ్య, పేద తరగతి ప్రజలకు అధిక డబ్బులను ఆశ చూపి మట్కా గేమ్​కు అలవాటు చేస్తున్న మట్కా బీటర్స్​ను అదుపులోకి తీసుకున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు లక్షల 46 వేల నగదు, 18 సెల్ ఫోన్లు, గేమ్​కు ఉపయోగించే లాటరీలను స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు. మహారాష్ట్ర కేంద్రంగా ఈ మట్కా గేమ్ జోరుగా సాగుతోందన్నారు. సింగిల్ డబుల్ నెంబర్ వస్తే 80 రేట్లు, ట్రిపుల్ నెంబర్ వస్తే 800 రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలుకుతూ మోసం చేస్తున్నారు. ఫలానా వారు అధిక లాటరీలు గెలుచుకున్నారని తప్పుడు సమాచారంతో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిస్తూ దగా చేస్తున్నారన్నారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 27 మందిని అరెస్టు చేసినట్లు, పరారీలో ఉన్న మరో పది మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వీరికి సహకరించిన తొమ్మిది మంది పోలీసులపై సీపీ సత్యనారాయణ కఠిన చర్యలు తీసుకోనున్నారు.

మట్కా బీటర్స్​ను అదుపులోకి తీసుకున్న రామగుండం కమిషనరేట్ పోలీసులు
ఇవీ చూడండి : కల్తీ పాలకు చెక్... ఫలిస్తున్న ప్రయోగాలు

ABOUT THE AUTHOR

...view details