తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టి విగ్రహాలను నెలకొల్పుదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటి డిగ్రీ కళాశాల విద్యార్థులు... సహజసిద్ధ వస్తువులతో విగ్రహాలు తయారు చేసి ప్రదర్శించారు.

By

Published : Aug 24, 2019, 7:53 PM IST

మట్టి విగ్రహాలను నెలకొల్పుదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే పూజించాలని... పెద్దపెల్లి జిల్లా ట్రినిటి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. సహజసిద్ధ వస్తువులతో విగ్రహాలను తయారుచేసి కళాశాలలో ప్రదర్శించారు. నీటిలో కరిగిపోయే మట్టి, పిండి, నవధాన్యాలు, పుష్పాలు, గడ్డి, జనుముతో వినాయక విగ్రహాలను తయారు చేశారు. పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో తయారుచేసిన విగ్రహాలను ఉపయోగించడం వల్ల మానవాళికి ప్రమాదం కలిగే అవకాశం ఉందన్నారు.

మట్టి విగ్రహాలను నెలకొల్పుదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

ABOUT THE AUTHOR

...view details