ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రత పాటించడం ద్వారా కరోనా వైరస్ను నివారించవచ్చునని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీపీ సత్యనారాయణ పాల్గొని విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, పాత్రికేయులకు రెండువేల మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.
పాత్రికేయులకు, పోలీసులకు మాస్కుల పంపిణీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలంటూ ట్రాఫిక్ పోలీసులు ప్లకార్డులు ప్రదర్శన నిర్వహించారు. రెండు వేల మాస్కులు, శానిటైజర్లను విధుల్లో ఉన్న పోలీసులకు, పాత్రికేయులకు రామగుండం సీపీ సత్యనారాయణ పంపిణీ చేశారు.
విధుల్లో ఉన్న కలం, ఖాఖీలకు రామగుండం సీపీ మాస్కుల పంపిణీ
ట్రాఫిక్ పోలీసులు 'ఇల్లు మద్దు-వీధి వద్దు' అంటూ ప్లకార్డులు పట్టుకుని చౌరస్తా వద్ద ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని.. తగు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సీపీ ప్రజలు సూచించారు. ఈ కార్యక్రమంలో పలుపురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి