పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీలో నీటి విడుదలను నిలిపేశాక చేపల కోసం ప్రజలు ఎగబడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మత్స్యకారుల జీవనోపాధి కోసం చేపపిల్లలను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని వివిధ బ్యారేజీల్లో విడుదల చేశారు. చేప పిల్లల వల్ల మత్స్యకారులకు జీవనోపాధి బాగా కలుగుతుందని ప్రభుత్వం భావించింది. ఈ సంవత్సరం నీటి ఎత్తిపోతల అనంతరం రాష్ట్రంలో అధికంగా వర్షాలు కురవగా.. గోదావరి నదికి వరదలు పైనుంచి రాగా గత పది రోజుల నుంచి పార్వతి బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు.
పార్వతి బ్యారేజీ వద్ద నీటి నిలిపివేత.. చేపల కోసం ఎగబడ్డ జనం - fish struck at parvathi barrage gates in peddapalli district
పెద్దపల్లి జిల్లా మంథని మండలం పార్వతి బ్యారేజీలో నీటి విడుదలను నిలిపేశాక చేపల వేట కోసం ప్రజలు ఎగబడుతున్నారు. బ్యారేజీ గేట్లు ఎత్తివేయగా మంచిర్యాల జిల్లా వైపు ఉన్న గేట్ల వద్ద చేపలు ఇరుక్కుపోగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేపలను వేటాడుతున్నారు.
![పార్వతి బ్యారేజీ వద్ద నీటి నిలిపివేత.. చేపల కోసం ఎగబడ్డ జనం fish struck at parvathi barrage gates in peddapalli district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8532502-297-8532502-1598238562065.jpg)
పార్వతి బ్యారేజీ వద్ద నీటి నిలిపివేత.. చేపల కోసం ఎగబడ్డ జనం
పార్వతి బ్యారేజీ వద్ద నీటి నిలిపివేత.. చేపల కోసం ఎగబడ్డ జనం
తాజాగా బ్యారేజీ గేట్లు ఎత్తివేయగా మంచిర్యాల జిల్లా వైపు ఉన్న గేట్ల వద్ద చేపలు, చేపపిల్లలు నీటి గుంటల్లో, రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉండగా ఒక్కసారిగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేపలను పట్టుకుని వెళ్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి కోసం చేపట్టిన చేపపిల్లల పెంపకం సత్ఫలితాలివ్వడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.