పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వామన్రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను 164 స్టేట్మెంట్ రికార్డ్ కోసం పోలీసులు గతనెల 19న మంథని కోర్టుకు తీసుకొచ్చారు.
మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదు
వామన్రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనుతో మంథని కోర్టు ఆవరణలో వీడియో కాల్ చేయించిన మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదైంది.
మంథని
ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ నిందితుడితో వీడియో కాల్ చేయించినట్లు ఆర్ఎస్ఐ ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. నిందితుడితో ఫోన్లో మాట్లాడించవద్దని వారించినా వీడియో కాల్ కొనసాగించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశంతో సెక్షన్ 186 కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: కరోనాతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు.. చికిత్స కోసం అప్పులపాలు!