పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ప్రవాస భారతీయులు బడితెల ఉమారాధా శ్రీనివాస్ మరికొంత మంది సహకారంతో నిధులుసేకరించి స్థానిక నిరుపేద మైనారిటీలకు సరుకులు అందించారు. ఉస్మాన్ పురకు చెందిన సుమారు 50 మంది మైనారిటీ మహిళా కుటుంబాలకు 27 రకాల నిత్యావసరాలను మంథని తహశీల్దార్ అనుపమ రావు చేతుల మీదుగా అందజేశారు. లాక్డౌన్ కాలంలో తోటి వారికి సహాయం చేయడం గర్వించదగ్గ విషయమని మంథని తహశీల్దార్ అన్నారు.
ప్రవాస భారతీయుల సహకారంతో నిత్యావసరాల పంపిణీ - cooperation with non-resident Indians Distributed essentials to minority womens
ప్రవాస భారతీయుల ఆర్థిక సహకారంతో మంథనిలోని నిరుపేద మైనారిటీ మహిళలకు స్థానిక తహశీల్దార్ అనుపమ రావు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చి అన్నార్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
![ప్రవాస భారతీయుల సహకారంతో నిత్యావసరాల పంపిణీ manthani mro anupama rao Distributed essentials to minority womens cooperation with non-resident Indians](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6748333-thumbnail-3x2-manthani.jpg)
ప్రవాస భారతీయుల సహకారంతో నిత్యావసరాల పంపిణీ
ప్రవాస భారతీయులు స్ఫూర్తితో స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రముఖ వ్యాపార వేత్తలు ముందుకుచ్చి పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు