హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీబీఐతో పాటు హైకోర్టు జ్యుడీషియల్ విచారణ జరపాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ఈ హత్య వెనుక చాలా మంది ఉన్నారన్న ఆయన... వాస్తవ విషయాలు వెలుగులోకి రావాలంటే ఉన్నతస్థాయి విచారణ చేపట్టాల్సిందేనన్నారు.
'సీబీఐతో పాటు హైకోర్టు జ్యుడీషియల్ విచారణ జరపాలి' - telangana varthalu
పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలో న్యాయవాద దంపతుల మృతదేహాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పరిశీలించారు. ఘటనపై సీబీఐతో పాటు హైకోర్టు జ్యుడీషియల్ విచారణ జరపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
'సీబీఐతో పాటు హైకోర్టు జ్యుడీషియల్ విచారణ జరపాలి'
పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి మృతదేహాలను పరిశీలించిన శ్రీధర్‌బాబు... సరైన కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. ఘోర సంఘటన జరిగినా ఇంతవరకూ అధికారులెవరూ స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్య