నూతన రెవెన్యూ చట్టంలో రికార్డింగ్ అథారిటీని తెలపలేదు. వివరాలు నమోదు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు అనే విషయం చెప్పలేదు. జాగీర్ భూముల అంశాన్ని పరిశీలించాలి. జాగీర్ అనే పదానికి ఇప్పటి వరకు నిర్వచనం లేదు. సేల్‌డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టీషన్ డీడ్ అంశాలపై స్పష్టత ఇవ్వాలి. ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రతి అంశంలో స్పష్టత ఇస్తే బాగుంటుంది.
నీడ్స్ అండ్ బాండ్స్ మ్యాప్‌ను కూడా తప్పకుండా పెట్టాలి. ఎమ్మార్వోలు, ఆర్డీఓల వద్ద నమోదుకాని రికార్డులు ఉన్నాయి. ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. పేర్లు, వివరాల నమోదులో అక్షర దోషాలు ఉంటే ఎవరు సవరించాలనే అంశం తెలపలేదు. సమస్యల పరిష్కారంలో పేదలకు న్యాయ సహాయం అందిస్తే బాగుంటుంది. ఇది హక్కులు ఇచ్చే చట్టం కాదు... వివరాలు నమోదు చేసే చట్టం.