పెద్దపెల్లి జిల్లా మంథనిలో కరోనా వైరస్ పై రెవెన్యూ, వైద్య శాఖ అధికారులతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమీక్షించారు. ముందస్తు చర్యల గురించి చర్చించారు. మంథని నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలని.. ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మంథని ప్రధాన కూడళ్ళలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించండి: శ్రీధర్ బాబు - మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమీక్ష
మంథనిలో కరోనా వైరస్‌పై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని.. ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించండి: శ్రీధర్ బాబు
గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిరోజుల పాటు బెల్ట్ షాపులు మూసివేయాలని శ్రీధర్ బాబు కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు సెలవు ప్రకటించిందని వారు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇసుక క్వారీల వద్ద ప్రతి రోజు వందల సంఖ్యలో కూలీలు ఇతర ప్రాంతాల నుంచి వస్తారని తెలిపారు. వారందరికీ పరీక్షలు నిర్వహించలేం కాబట్టి తాత్కాలికంగా ఇసుక క్వారీలను మూసివేయాలని కలెక్టర్‌కు తెలిపారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: రేపు కరీంనగర్‌లో సీఎం పర్యటన
TAGGED:
పెద్దపెల్లి జిల్లా మంథని