సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అన్నారని.. అయితే మంథని నియోజకవర్గంలో అధికార పార్టీ వారు మాత్రమే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. ప్రత్యక్షంగా దాడులకు దిగుతున్నారని, అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
లారీ డ్రైవర్‌పై తెరాస కార్యకర్తల దాడి.. శ్రీధర్ బాబు ఆగ్రహం - పెద్దపల్లి జిల్లా వార్తలు
మంథనిలో ఓ లారీ డ్రైవర్‌పై ఆదివారం నాడు తెరాస కార్యకర్తలు దాడి చేశారు. బాధితుడు గాయాలతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అధికార పార్టీ కార్యకర్తలు ప్రత్యక్షంగా దాడులకు దిగుతున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లారీ డ్రైవర్‌పై తెరాస కార్యకర్తల దాడి.. శ్రీధర్ బాబు ఆగ్రహం..
మంథని మున్సిపాలిటీలో రౌడీయిజం నడుస్తోందని, తమని చంపుతారా అని బాధితుడి భార్య నిలదీశారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. పోలీసులు తెరాస కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు.
ఇవీ చూడండి: అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్బీ మద్దతు