తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రి నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలి : శ్రీధర్ బాబు - కలెక్టర్​కు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ రాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

మంథని మున్సిపల్ పరిధిలో మంజూరైన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలని కోరుతూ కలెక్టర్​కు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాశారు.

manthani mla sridhar babu wrote a letter to collector
ఆస్పత్రి నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలి – శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే

By

Published : May 23, 2021, 12:19 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో మంజూరు అయిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరుతూ… మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్​కు లేఖ రాశారు. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం మంథని నుంచి ఎగ్లాస్ పూర్ వెళ్లే రోడ్డులో ఉన్న ప్రభుత్వ భూములైన సర్వే నంబర్ 315లో ఉన్న 2ఎకరాల 20 గుంటల భూమిని వాడుకోవాలని సూచించారు.

ఈ ప్రభుత్వ భూమికి ఎదురుగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఉందని.. ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తే బాగుంటుందని లేఖలో ఎమ్మెల్యే వివరించారు. ఈ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details