పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట హనుమాన్ దేవాలయంలో గణనాథునికి స్థానిక శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో అభిషేకాలు చేపట్టారు. అనంతరం గణనాథునికి పూజలు చేశారు. దేవాలయ ఆవరణలో గణపతి హోమాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. స్వామివార్లకు ధూప, దీప, నైవేద్యాలు నివేదించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మంథనిలో దుద్దిళ్ల ప్రత్యేక పూజలు - మంథని
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో స్థానిక శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంథనిలో దుద్దిళ్ల ప్రత్యేక పూజలు