పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఇటీవల జరిగిన దళిత యువకుడి హత్యకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ తలపెట్టిన 'ఛలో మల్లారం' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుతోపాటు జిల్లా అధ్యక్షుడిని గృహ నిర్బంధం చేశారు.
మంథనిలో కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం - మంథనిలో కాంగ్రస్ నాయకుల అరెస్ట్
పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన 'ఛలో మల్లారం' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు.
![మంథనిలో కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం congress leaders house arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8176768-84-8176768-1595742532919.jpg)
మంథనిలో కాంగ్రెస్ నాయకుల గృహనిర్బంధం
శాంతియుతంగా 'ఛలో మల్లారం' కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులపై ఇష్టానుసారంగా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెరాస ప్రభుత్వాన్ని ఓడించి వారికి సరైన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు