పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన వెంకటేష్.. కొంతమంది స్నేహితులతో కలిసి రామగిరి ఖిల్లా సమీపంలోకి వెళ్లారు. అక్కడ అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వెంకటేష్ మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమించగా.. పెద్దపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
జంతువుల కోసం పెట్టిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి - man died due to current shock at ramgiri killa
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగిరి ఖిల్లా సమీపంలో అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమించగా అతన్ని పెద్దపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

జంతువుల కోసం పెట్టిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి
మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రామగిరి ఎస్సై మహేందర్ వెల్లడించారు. విద్యుత్ తీగలు వీరే అమర్చి.. ప్రమాదవశాత్తు విద్యదాఘాతంతో మరణించారా.. లేక ఇతరులు పెట్టిన తీగలు తగిలాయా అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి:వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు