పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణం అనంతరం పెద్దపట్నం చేశారు.
నిరాడంబరంగా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు - latest news of peddapalli
కరోనా నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. గత రెండురోజులుగా కొనసాగుతున్న ఉత్సవాలు స్వామివారి ఊరేగింపుతో నేడు ముగిశాయి.
నిరాడంబరంగా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
రాత్రి ఒగ్గు పూజారులు డోలలతో మల్లికార్జునుడికి అభిషేకం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున భక్తులు అగ్ని గుండం నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన స్వామివారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలను ముగించారు. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు