కామ్రేడ్ నారాయణ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాస్కర్ రావు భవన్లో ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి... నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
'నారాయణ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి' - కామ్రేడ్ ఎం. నారాయణ సంస్మరణ సభ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన కామ్రేడ్ ఎం. నారాయణ మృతి సీపీఐకి తీరనిలోటు అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గోదావరిఖనిలోని భాస్కర్ రావు భవన్లో ఏర్పాటు చేసిన ఆయన సంస్మరణ సభలో పాల్గొన్నారు.
నారాయణ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి
నారాయణ నీతినిజాయతీకి మారుపేరని, సింగరేణిలో ఉద్యోగం చేస్తూ... యూనియన్ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన నిర్వహించిన సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'జీవన్మరణ పోరాటంలో విజయం తథ్యం'