లాక్ డౌన్ నిబంధనలు మరోసారి ఉల్లంఘిస్తే కఠిన చర్యలతో పాటు కేసు నమోదు చేస్తామని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సీజ్ చేసిన వాహనాలను యజమానులకు అప్పగించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు.. మరోసారి పోలీసులకు పట్టుబడితే కేసు నమోదు చేస్తామని డిసిపి పేర్కొన్నారు.
లాక్ డౌన్ ఎఫెక్ట్: మరోసారి వాహనదారులు పట్టుబడితే కేసు నమోదు - COVID-19 | Peddapalli declared virus-free
పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సీజ్ చేసిన వాహనాలను యజమానులకు అప్పగించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు.. మరోసారి పోలీసులకు పట్టుబడితే కేసు నమోదు చేస్తామని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
లాక్ డౌన్ ఎఫెక్ట్: మరోసారి వాహనదారులు పట్టుబడితే కేసు నమోదు
ప్రభుత్వ ఆంక్షలు దృష్టిలో ఉంచుకుని అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారు.. తగిన ఆధారాలు, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి తమ పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు సుమారు 600 వాహనాలకు జరిమానా విధించి వాహన యజమానులకు అప్పగించారు.
ఇదీ చూడండి:హిమాయత్ సాగర్ వద్ద చిరుత ఆచూకీ