పెద్దపల్లి జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు పటిష్ఠంగా అమలవుతున్నాయి. సడలింపు సమయంలో దుకాణాలు, మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడాయి. పలు ప్రాంతాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘన జరిగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ప్రజలను హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసుల కొరడా - lock down in peddapalli district
పెద్దపల్లి జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు వస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.
![నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసుల కొరడా lock down, lock down in peddapalli, telangana lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:12:10:1622104930-tg-krn-41-27-baarigafines-av-ts10038-27052021111248-2705f-1622094168-1089.jpg)
లాక్డౌన్, పెద్దపల్లి లాక్డౌన్, తెలంగాణ లాక్డౌన్
సుల్తానాబాద్ పట్టణంలో ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ-పాస్ లేకుండా రహదారులపైకి వచ్చిన వారిని హెచ్చరిస్తూ.. వాహనాలు సీజ్ చేశారు.