రామగుండం నగరపాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాలకు విముక్తి కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. పెద్దపెల్లి జిల్లా రామగుండం సమీపంలోని లింగాపూర్, కుందనపల్లి, కాట్రపల్లి, ఎన్నికలపల్లిని తిరిగి గ్రామపంచాయతీలుగా కొనసాగించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నగర సమీపంలో ఉన్న గ్రామాలను విలీనం చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేకపోవటంతో పాటు అనవసరంగా పన్నుల భారం పడుతుందని విలీన ప్రక్రియను రద్దు చేశారు. ఈ ప్రకటనతో ఆయా గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు.
రామగుండంలో విలీనం చేసిన గ్రామాలకు విముక్తి
రామగుండం నగరపాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాలను తిరిగి పంచాయతీల్లోనే కొనసాగించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ ప్రకటనతో ఆయా గ్రామస్థులు సంబురాలు చేసుకున్నారు.
రామగుండంలో విలీనం చేసిన గ్రామాలకు విముక్తి