తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం' - 'Let's build a plastic free society'

పెద్దపల్లి జిల్లాలో మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.

'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం'

By

Published : Oct 2, 2019, 1:23 PM IST

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దపెల్లి ఏసీపీ వెంకటరమణా రెడ్డితో పాటు లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ప్రజలంతా ప్లాస్టిక్ కవర్లను వ్యతిరేకించాలని, గృహ అవసరాల అన్నింటికీ బట్టతో తయారు చేసిన సంచులను వినియోగించాలని కోరారు. అనంతరం బస్టాండ్ కూడలిలో ప్లాస్టిక్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. మహత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీని చేపట్టిన ఈనాడు, ఈటీవీ కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details