తెలంగాణ

telangana

ETV Bharat / state

కూర్చోడానికి కుర్చీ లేదు.. తాగడానికి నీళ్లు లేవు... - left parties protest in peddapalli district

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

left parties protest at peddapalli district hospital
పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది కొరత

By

Published : Aug 24, 2020, 5:49 PM IST

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ప్రారంభమైనా.. 88 వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు అయితే ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల 34 మంది మాత్రమే పని చేస్తున్నారని వామపక్ష నేతలు మండిపడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది తక్కువ ఉండటం వల్ల ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల రోజులు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. గర్భిణీలు కూర్చోవడానికి సరైన వసతులు లేవని, తాగునీరు కూడా లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని నియమించి, మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:'ఎస్పీబీకి కరోనా నెగటివ్.. అవాస్తవమన్న చరణ్'

ABOUT THE AUTHOR

...view details