పెద్దపెల్లి జిల్లా మంథని మండలం బోయిన్పేటలో లక్ష్మీ దేవి బోనాల జాతర వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఖరీఫ్ పంటలు చేతికందిన సమయంలో ముదిరాజ్, సామాజిక వర్గీయులు.. తమ ఆరాధ్య దైవంగా భావించే లక్ష్మీదేవికి బోనాల వేడుక నిర్వహిస్తారు. జాతర సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
లక్ష్మీదేవికి బోనాలు... భారీగా తరలివచ్చిన భక్తులు - laxmi devi bonala jathara
పెద్దపల్లి జిల్లా మంథని మండలం బోయిన్పేటలో లక్ష్మీ దేవి బోనాల జాతర వైభవంగా జరిగింది. ప్రతి ఏటా సంక్రాంతి రోజు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అమ్మవారికి మహిళలు.. నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

లక్ష్మీ దేవి బోనాల జాతర, బోయిన్పేట
మహిళలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కొత్త బియ్యం, బెల్లంతో వండిన పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. డప్పు చప్పుళ్లు, కృష్ణ స్వామి, పోతరాజు నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఉత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
వైభవంగా బోయిన్పేటలో లక్ష్మీ దేవి బోనాల జాతర