పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామంలో మంగళవారం చిదురాల రాజమ్మ అనే వృద్ధురాలిని బెదిరించి మూడు తులాల గొలుసును దొంగలించిందో కిలాడీ. నీళ్లు కావాలంటూ వచ్చి గొలుసు దోచుకెళ్లిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలని గుర్తించి ఆమె నుంచి చోరీ సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై గతంలో కూడా పలు కేసు నమోదయ్యాయని గోదావరిఖని ఏసీపీ ఉపేందర్ వెల్లడించారు. రిమాండ్ నిమిత్తం మంథని కోర్టుకు తరలించినట్లు తెలిపారు.
మహిళ దొంగ అరెస్టు... రిమాండ్కు తరలింపు - మహిళ దొంగ అరెస్టు... రిమాండ్కు తరలింపు
మహిళను బెదిరించి గొలుసు దొంగతనం చేసిన కిలాడీని మంథని పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు.
![మహిళ దొంగ అరెస్టు... రిమాండ్కు తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4395405-thumbnail-3x2-mahila.jpg)
మహిళ దొంగ అరెస్టు... రిమాండ్కు తరలింపు