తెలంగాణ

telangana

ETV Bharat / state

"రైతుల కష్టాలను తీర్చిన.. అపర భగీరథుడు కేసీఆర్"

కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. రైతుల కష్టాలను తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్‌ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన జలజాతర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

CM KCR's inspiration to the country's farmer: MLA Korukanthi
"రైతుల కష్టాలను తీర్చిన.. అపర భగీరథుడు కేసీఆర్"

By

Published : May 23, 2020, 8:53 PM IST

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో జలజాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. తక్కళ్లపల్లి గ్రామంలోని కాలువాలో పుడికతీత, చెట్ల తొలగింపు పనులతో పాటు 76లక్షల డీఎంఎఫ్​టీ నిధులతో నూతన రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఉపాధిహామీ కులీలకు అంబలి, అన్నదానం చేశారు.

రైతాంగం, వ్యవసాయం పట్ల సీఎం ప్రత్యేక దృష్టి

సమాఖ్య పాలనలో బీటాలు వారిన నేలలను చూశామని, కరెంట్ కష్టాలను ఎద్కుర్కొన్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో ఎదురుచూసిన పరిస్థితుల నుంచి బయటపడ్డామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ తెలంగాణ రైతులు, వ్యవసాయం పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

సాగునీటి కోసం కాళేశ్వరం..

సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. రైతుల కష్టాలను రూపుమాపారని స్పష్టం చేశారు. ఉచితంగా కరెంట్, పంటలకు పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులతో పాటు చెరువుల పుడికతీత కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వానాకాలం సాగు కోసం చివరి ఆయకట్టువరకు నీళ్లందిస్తామన్నారు.

ఇదీ చూడండి:నిప్పుల కొలిమిలా ఓరుగల్లు.!

ABOUT THE AUTHOR

...view details