టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కెంగర్ల మల్లయ్య రాజీనామా - కెంగర్ల మల్లయ్య రాజీనామా
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ పత్రాన్ని సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు.
తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సహా సింగరేణి వ్యాప్తంగా ముఖ్య నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామ పత్రాలను సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. సంఘంలో నెలకొన్న విభేదాల వల్లనే 18 ఏళ్ల సుధీర్ఘ బంధాన్ని వీడినట్లు మల్లయ్య తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యచరణను వెల్లడిస్తానని పేర్కొన్నారు. సంఘంలో తనకు ప్రాతినిధ్యం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలుగా సింగరేణిలో గులాబీ జెండా ఎగుర వేశానని, లాఠీ దెబ్బలు తిని సకల జనుల సమ్మెను ముందుకు నడిపిన తనకు అవమానం జరిగిందన్నారు.
- ఇదీ చూడండి : ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!