టీబీజీకేఎస్ సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లయ్య రాజీనామా చేశారు. మల్లయ్యతో పాటు సింగరేణి వ్యాప్తంగా ఆయా డివిజన్ల నాయకులు వైదొలిగారు. రాజీనామా పత్రాన్ని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితకు పంపారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మల్లయ్య తెలిపారు. టీబీజీకేఎస్ ఆవిర్భావంలో కెంగర్ల మల్లయ్య పాత్ర ఎంతో కీలకం. సంఘంలో నెలకొన్న విభేదాలతో 18 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని మల్లయ్య తెంచుకున్నారు. సింగరేణిలో 2002లో తెబొగకా సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటివరకూ కీలకబాధ్యతల్లో ఉన్నారు. మల్లయ్య బీఎంఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీబీజీకేఎస్‌కు కెంగర్ల మల్లయ్య రాజీనామా - టీబీజీకేఎస్‌కు కెంగర్ల మల్లయ్య రాజీనామా!
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య తన పదవికి రాజీనామా చేశారు. మల్లయ్యతో పాటు సింగరేణి వ్యాప్తంగా ఆయా డివిజన్ల నాయకులు వైదొలిగారు.
టీబీజీకేఎస్‌కు కెంగర్ల మల్లయ్య రాజీనామా