డిసెంబరు 9న తెలంగాణ ప్రకటించిన రోజును పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖనిలో 'సుజలాం..సుఫలాం..తెలంగాణం..' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ హైదరాబాద్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపంకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో జల నీరాజనం చేయబోతున్నట్లు వెల్లడించారు.
కాళేశ్వరం నీళ్లతో... అమరవీరులకు 'జల నీరాజనం' - Keleswaram Water Hydration for Telangana Martyrs
డిసెంబర్ 9, 2009న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి పదేళ్లయినా నేపథ్యంలో ఇవాళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎమ్మెల్యే కోరుకంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బిందెలతో కాళేశ్వరం జలాలను తీసుకొని హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి జల నీరాజనం చేయనున్నట్లు వెల్లడించారు.
కాళేశ్వరం నీళ్లతో... అమరవీరులకు 'జల నీరాజనం'
గోదావరినది వద్ద ప్రత్యేక పూజలు చేసి బిందెలతో నీటిని తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సముద్రంలో కలిసే నీటిని ఒడిసి పట్టి తెలంగాణ భూములన్ని పచ్చదనంతో వెల్లివిరియాలని సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: బకాయిలపై ప్రధానిని కలిసే యోచనలో ముఖ్యమంత్రి