కేంద్రంలో ప్రాంతీయ కూటమే అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తెరాస సన్నాహక సభలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనూ.. రైతులకు ఉచిత విద్యుత్ లేదని.. తెలంగాణలో మాత్రమే ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. ఉత్తర భారత్‌లో సగం రాష్ట్రాలు చీకట్లోనే ఉన్నాయని ఆవేదన చెందారు. 16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని, దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తానన్నారు.
"దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా: కేసీఆర్" - trs
దేశంలో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలోనే భారతదేశం నంబర్‌వన్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్‌ల హవా తగ్గిందని.. అధికారంలోకి వచ్చేది ప్రాంతీయ పార్టీల కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. 16 ఎంపీ స్థానాల్లో తెరాసను గెలిపించాలని కోరారు.
గోదావరిఖని తెరాస సభలో కేసీఆర్