తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల సభలు జరగవు - మన దేశంలోనూ అలాంటి విధానం రావాలి : సీఎం కేసీఆర్ - ఇవాళ కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ

KCR Election Campaign in Ramagundam : నష్టాల్లో ఉన్న సింగరేణిని రూ.2200 కోట్ల లాభాల్లోకి తీసుకెళ్లామని రామగుండం ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపిస్తే రామగుండంలో పరిస్థితులకు తగిన పరిశ్రమల నెలకొల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

KCR Election Campaign in Ramagundam
KCR Election Campaign in Peddapalli

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 4:42 PM IST

KCR Election Campaign in Ramagundam : సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని.. సంస్థను విస్తరించుకుంటామే తప్ప.. వదులుకోవడంలో రాజీపడమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో బీఆర్ఎస్‌ నాయకులు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)లో కేసీఆర్ పాల్గొన్నారు.

KCR Praja Ashirvada Sabha at Ramagundam: అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల సభలు జరగవని.. టీవీల్లో నాయకుల చర్చలు విని ప్రజలు నిర్ణయానికి వస్తారని కేసీఆర్‌ తెలిపారు. మన దేశంలో కూడా అలాంటి విధానం రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించాలని.. దీంతో పాటు అభ్యర్థులను, వారి పార్టీ చరిత్రను చూసి ఓటు వేయాలని సూచించారు.

గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకూ కాంగ్రెస్‌ నీళ్లు ఇవ్వలేకపోయింది : సీఎం కేసీఆర్​

KCR Public Meeting in Peddapalli: బీఆర్ఎస్‌(BRS) పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసమనికేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద పెరుగుతున్నా కొద్దీ సంక్షేమ పథకాలకు నిధులు పెంచామని చెప్పారు. కంటి వెలుగు(Kanti Velugu) వంటి కార్యక్రమాన్ని ఎవరూ ఊహించలేదని.. రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని అన్నారు.

ప్రచారంలో దూసుకెళుతున్న బీఆర్​ఎస్​ - నమ్మి ఓటేస్తే మళ్లీ పాతరోజులొస్తాయని హెచ్చరిక

CM KCR ON Telangana Development : ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116 ఇస్తున్నామనికేసీఆర్‌గుర్తు చేశారు. రైతుబంధు అనే పదాన్ని గతంలో ఎప్పుడైనా విన్నారా? అని ప్రశ్నించారు. ఈ పథకం పుట్టించిందే బీఆర్ఎస్‌ పార్టీ అని తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా ఇచ్చిన నగదును వృథా చేస్తున్నామని కాంగ్రెస్‌(Congress) నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 3 గంటల కరెంట్‌ చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని పేర్కొన్నారు. రైతుల భూమి మీద పూర్తి హక్కులు రైతులకే కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్‌ అని హర్షం వ్యక్తం చేశారు.

జాగ్రత్తగా ఓటు వేయకుంటే చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది : కేసీఆర్

"ధరణి తీసేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి?. ధరణి తీసేస్తే.. మళ్లీ దళారులు, లంచాల రాజ్యం వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధులో అధికారులు వాటా అడుగుతారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని రూ.2200 కోట్ల లాభాల్లోకి తీసుకెళ్లాం. ఇతర మైనింగ్‌లను కూడా సింగరేణి కార్మికులకు అప్పగిస్తాం. స్థానికంగా పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తాం."- కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి

రామగుండంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను

CM KCR Comments on Congress : రాష్ట్రాన్ని, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పాలించిందని గుర్తు చేశారు. అప్పులు తీర్చలేక సింగరేణిలో 49 శాతం వాటాను కేంద్రానికి అమ్మింది కాంగ్రెస్‌ నాయకులేనని ఆరోపించారు. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాల హక్కులను తొలగించింది కూడా కాంగ్రెస్‌ పార్టీనని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే-పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details