తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణలక్ష్మీ, సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ - kalyana lakshmi, cmrf cheques distribution in manthani constituency

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని కల్యాణ లక్ష్మీ, సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం నాలుగు మండలాలకు చెందిన వారికి చెక్కులు అందించారు.

kalyana lakshmi, cmrf cheques distribution in manthani
మంథనిలో కల్యాణలక్ష్మీ, సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

By

Published : May 20, 2021, 4:12 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కల్యాణలక్ష్మీ, సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. 138 కల్యాణలక్ష్మీ చెక్కులు, 18 సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు.. లబ్ధిదారులకు అందజేశారు. మంథని మండలంలో 78, ముత్తారం 23, రామగిరి 25, కమాన్​పూర్​ మండల పరిధిలోని 12 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులు అందికంచారు.

అనంతరం కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలకు మాస్కులు, ఫేస్​ షీల్డులు ఎమ్మెల్యే అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు పాటుపడాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు.

ఇదీ చదవండి:లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించండి: సత్యవతి రాఠోడ్

ABOUT THE AUTHOR

...view details