తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోత

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. గోలివాడలోని పార్వతి పంప్​హౌజ్​ నుంచి 4 మోటార్ల ద్వారా నీరు వదులుతున్నారు. అయితే కొద్దిరోజుల కిందట ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేశారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోత
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోత

By

Published : Feb 18, 2020, 7:34 PM IST

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతి పంప్‌హౌజ్‌ నుంచి 4 పంపు మోటర్ల ద్వారా 10,400 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోతలను ప్రారంభించారు.

అయితే గత కొద్ది రోజుల కిందట ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. మరల కాళేశ్వరం జలాలను తిరిగి ఎల్లంపల్లి జలాశయంలోకి వదులుతున్నారు. పంప్​హౌజ్​ డెలవరీ చాంబర్‌ ద్వారా నీరు అప్రోచ్‌ కాలువలో పడి ఎల్లంపల్లి జలాశయంలోకి కలవడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండల మారనుంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోత

ఇవీ చూడండి:మేడారం: 7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం

ABOUT THE AUTHOR

...view details