తెలంగాణ

telangana

ETV Bharat / state

వస్త్ర సంచుల తయారీకేంద్రం ప్రారంభం - ప్రారంభించిన మంత్రులు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో వస్త్ర సంచుల తయారీకేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్​తో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు​ ప్రారంభించారు.

వస్త్ర సంచుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

By

Published : Sep 14, 2019, 1:37 PM IST

వస్త్ర సంచుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్​ను పూర్తిస్థాయిలో నిర్మూలించాల్సిన అవసరముందని పంచాయతీరాజ్​ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన నాన్​ ఓవన్ సంచుల తయారీ యంత్రాలను మంత్రి కొప్పుల ఈశ్వర్​తో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి దేవసేన పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ సంచులకు బదులు జూట్​ సంచులను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని దేవసేన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details